| Daily భారత్
Logo




దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2025-06-25 06:31:32

Share: Share


దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ ఆవరించింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి సైతం ఆందోళనగా ఉందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సజీవ దహనమైన మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. అవి ఏ మాత్రం గుర్తు పట్టలేని విధంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని సైతం పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధిత కుటుంబాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >