Posted on 2025-06-24 10:26:00
డైలీ భారత్, హైదరాబాద్: సాధారణంగా మనం హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఏదైన గొడవలు, ప్రమాదాలు మొదలైన ఘటనలు జరిగినప్పుడు చాలా మంది పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారు. ఇది మనం తరచుగా చూస్తుంటాం.
ఈ క్రమంలో కొంత మంది వెరైటీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు ఇస్తుంటారు. కొంత మంది తమ పెంపుడు శునకం పోయిందని, తమ ఇంట్లోకి కోళ్లు ఎవరైన ఎత్తుకొని పోయారని కంప్లైంట్ లు ఇస్తుంటారు. ఇవి కూడా చూశాం. అయితే.. తాజాగా.. మాత్రం ఒక వెరైటీ పోలీసు కంప్లైట్ ఘటన వార్తలలో నిలిచింది. పోలీసులు కూడా ఈ ఫిర్యాదు విని అవాక్కైయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది.
కూకట్‌పల్లిలో స్థానికంగా ఉండే.. ఒక వ్యక్తి తన దగ్గరగా ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్లి పాలప్యాకెట్ కొనుగోలు చేశారు. అతను ఇంటికి వెళ్లి వేడి చేయడానికి పెట్టాడు. కానీ ఆ పాలు అనూహ్యంగా విరిగిపోయాయి. దీంతో ఆగ్రహించిన అతను ఏకంగా రత్నదీప్ యాజమాన్యం దగ్గరకు వెళ్లి దీనిపై ప్రశ్నలు వేశాడు.
వారు మాత్రం నెగ్లీజెన్సీగా సమాధానం చెప్పారు. దీంతో అతను మరింత ఫ్రస్టేషన్ కు గురై.. దగ్గరలోని పీఎస్ కు వెళ్లి మరీ తన గొడును చెప్పుకున్నాడు. వెంటనే సూపర్ మార్కెట్ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
చాలా సేపు బాధితుడికి పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను మాత్రం.. మొండి పట్టుపట్డడంతో ఇక లాభంలేదని.. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. సూపర్ మార్కెట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >