Posted on 2025-06-24 10:30:12
డైలీ భారత్, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ విషయం తెలిసి, మందలించడంతో ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది ఆ కుమార్తె. NLB నగర్ లో అర్థరాత్రి హత్య జరిగింది.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్ లో సట్ల అంజలి(39), తన కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక(16) టెన్త్ క్లాస్ చదువుతోంది. పగిల్ల శివ(19)తో బాలికకు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తరచుగా అతడితో మాట్లాడుతున్న గుర్తించిన తల్లి అంజలి కూతుర్ని మందలించింది. అతడ్ని కలవొద్దు అని, ప్రేమ వ్యవహారం లాంటి వాటి జోలికి వెళ్లొద్దని బాగా చదువుకోవాలని కుమార్తెకు సూచించింది. దాంతో ఇక ప్రియుడ్ని కలుస్తానో లేదో, అతడు దూరం అవుతాడని భావించి కన్నతల్లి హత్యకు ప్లాన్ చేసింది.
పేగు బంధాన్ని మరిచిన కూతురు తన ప్రియుడు పగిల్ల శివ, అతడి సోదరుడు పగిల్ల యశ్వంత్(18) తో కలిసి తల్లిని హత్య చేయాలని డిసైడ్ అయింది. సోమవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి గొంతు నులిమి, ఆపై తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాలికను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు చెబుతుందన్న కారణంగానే తల్లి హత్యకు ప్లాన్ చేసి చంపేసిందని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.
#jeedimetla #medchal
బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించిన విశాఖ నగర సిపి
Posted On 2025-12-10 20:33:49
Readmore >
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల
Posted On 2025-12-10 17:38:13
Readmore >
కొత్త డిసిసి అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టేక్కిస్తాడా..!
Posted On 2025-12-10 17:25:12
Readmore >
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూవీ మేకప్ ఆర్టిస్ట్ సాయిబాను
Posted On 2025-12-10 17:24:14
Readmore >
గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు
Posted On 2025-12-10 17:17:33
Readmore >
సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్
Posted On 2025-12-10 17:15:11
Readmore >
ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2025-12-10 08:52:42
Readmore >