Posted on 2025-06-23 21:21:19
మహిళల ఆత్మగౌరవంతో కట్టుకునేలా నాణ్యమైన చీరలు సరఫరా
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నేతన్నల, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ
నేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ
4 కోట్ల 30 లక్షల మీటర్ల చీర ఉత్పత్తి ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి
సిరిసిల్ల ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాష్ట్రంలోని ఎస్.హెచ్.జీ ( మహిళా సంఘాల సభ్యులు)లకు ఇందిరా మహిళా శక్తి కింద సిరిసిల్లలో సిద్ధం చేస్తున్న చీరలు పంపిణీ చేయనుండడం గర్వకారణమని
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టు కునేలా నాణ్యమైన చీరలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నాణ్యతను పరిశీలించారు. అనంతరం చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
నేతన్నల, రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయలను వానాకాలం పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు.
నేతలను సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కలెక్టర్ నుంచి చేనేత జౌళి శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వరకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెండింగ్ బకాయిలను కూడా తమ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ రంగంలో తయారయిన ప్రతి బట్ట ఆర్డర్ చేనేత కార్మికులకు అందిస్తున్నామని, డబ్బుకు వెనకాడకుండా కమిటి వేసి మహిళలకు మెరుగైన చీరలు అందించేలా ప్రభుత్వం నిర్ణయించి, ఆర్డర్ ను ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు సిరిసిల్లలో తయారుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు, ఆసాములకు చేతి నిండా పని కల్పించడంలో ప్రభుత్వానికి ఆత్మసంతృప్తి ఉందని అన్నారు.చేనేతలకు ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని, నూలు సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంచేలా మంచి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
4 కోట్ల 30 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తి లక్ష్యం ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని అన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యుత్ బకాయిల సమస్య కూడా పరిష్కరించుకున్నామని అన్నారు. నేత కార్మికులను, పవర్ లూమ్ రంగానికి కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రజల దశాబ్దాల కల నూలు డిపో ఏర్పాటు చేశామని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంగా నిలిచిపోతుందని అన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలను వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.
47 కోట్ల 98 లక్షల రూపాయల కలెక్టర్ ఖాతాలో జమ చేసే అభివృద్ధి పనులు వేగవంతం చేశామని అన్నారు. ఆలయ అభివృద్ధికి రాజన్న అనుమతి లభించిందని, 76 కోట్లతో ఆలయం 4 ఎకరాలకు విస్తరణ పనులు టెండర్లు పిలిచామని అన్నారు.
పద్మశాలి భవన్ కు ప్రభుత్వం 5 కోట్ల, 3 కోట్ల రూపాయల సంఘాల నుంచి సేకరించి నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. సిరిసిల్ల చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన చీరల ఆర్డర్ ను సకాలంలో పూర్తి చేసి అందించాలని తెలిపారు. జూన్ నెలాఖరు నాటికి సగం ఆర్డర్ డెలివరీ పూర్తి చేయాలని, చేనేత కార్మికులకు అవసరమైన నూలు వేములవాడ డిపో నుంచి తరపున అవుతుందని, కార్మికులు అందించిన చేనేత చీరలను ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తుందని, చీరల ఆర్డర్ తరఫున పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వం సంబంధిత నిధులను విడుదల చేస్తుందని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఆర్డర్ ను చేనేత కార్మికులంతా విజయవంతంగా పంపిణీ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర్ రావు, ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
బిజ్జరం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విద్యాసాగర్ ఘన విజయం
Posted On 2025-12-11 20:32:02
Readmore >
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-12-11 19:23:59
Readmore >
డాక్టర్ ఏ.విశాల్ నూతన పిల్లల మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించిన ప్రారంభించిన సీపీ
Posted On 2025-12-11 19:14:34
Readmore >
ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2025-12-11 11:52:42
Readmore >
అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు
Posted On 2025-12-11 11:17:56
Readmore >