Posted on 2025-06-23 17:43:09
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: ఒకప్పుడు నిత్య పెళ్లి కొడుకుల వ్యవహారలు వెలుగు చూసేవి.. ఇప్పుడు కాలం మారిపోయింది.. నిత్య పెళ్లి కూతుళ్లు కూడా చెలరేగిపోతున్నారు.. ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే స్కెచ్ వేసి మరి కాటికి పంపుతుండగా.. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు..
అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే.. వారిని పెళ్లి చేసుకోదండోయ్.. ఆమె, టార్గెట్ అంతా వేరు.. ఆమె వెనుక ఓ గ్యాంగ్ కూడా ఉందంటే నమ్మండి.. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తుందట.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ... ఇక, నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహకారం ఉందట.. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుని.. వారికి మాయ మాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ.. కొంత సమయం తీసుకుని.. ఆ తర్వాత తన కన్నింగ్ ఐడియాను అమలు చేస్తోంది.. వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది.. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది.. ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా..? నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.. తమకు జరిగిన అన్యాయాన్ని.. ఎలా మోస పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు...
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >