| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తక్కువ ధరకు బంగారం అమ్ముతామని మోసం చేసిన వ్యక్తి అరెస్టు

తక్కువ ధరకు బంగారం అమ్ముతామని మోసం చేసిన వ్యక్తి అరెస్టు

డైలీ భారత్, హైదరాబాద్: తక్కువ ధరకు బంగారం అమ్ముతామని మోసం చేసిన వ్యక్తిని అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి అంతర్రాష్ట్ర మోసగాడు ముఠా సభ్యుడిగా గుర్తించారు. తక్కువ ధరకు బంగారం అందజేస్తామని హామీ ఇచ్చి ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులు అనేక మంది అమాయకులను మోసం చేసినట్లు సమాచారం. బాధితుల నుండి రూ.40 లక్షలు వసూలు చేసి ఈ వ్యక్తులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు జై కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు ఉదయ్, సందీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.

Previous వృద్ధురాలుని బంధించి దొంగతనం చేసిన కేసులో నిందితుల అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన నాగారం పోలీసులు
Next నిత్య పెళ్లి కూతురు..! ఇప్పటికే 12 పెళ్లిళ్లు.. ఆమె టార్గెట్‌ వాళ్లే
ADVERTISEMENT