Posted on 2025-06-23 18:26:46
యేసు వివరాలను డీఎస్పీ కార్యాలయం నందు వెల్లడించిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్.
డైలీ భారత్, సూర్యాపేట:ప్రదాన నింధితుడు ఐనా A1 బోడ వెంకటేష్ నివాసం మేడిపల్లి , హైదరాబాద్ , స్వస్థలం ఈటూర్ గ్రామము నాగారం మండలము సూర్యపేట్ జిల్లా తాను ఆటో డ్రైవరు గా పని చేసేవాడు, బాదితురాలు అయిన నంగునూరి బయ్యమ్మ భర్త 70 సంలు వృద్ధురాలు ఈటూర్ గ్రామం తన కుటుంబ సభ్యులు అందరూ జీవనపాది కోసం చెన్నే యందు స్థిరపడగా, తాను ఒక్కతే ఈటూర్ గ్రామములో ఉంటుంది, ఆమె భూమిని నేరస్థుడు వెంకటేష్ మామ అయిన యాల రమేష్ కౌలుకూ చేస్తున్నాడు. అతనితో పాటు నేరస్థుడు అప్పుడప్పుడు బయ్యమ్మ ఇంటికి వెళ్ళిన నేరస్థుడు ఆమె ఒంటరిగా నివశిస్తున్నది మరియు ఆమె పై ఉన్న బంగారం చూసి, అట్టి బంగారం ను దొంగిలించాలనే ఉద్దేశముతో తన స్నేహితులు అయిన మిగతా నెరస్థులతో పాటు జట్టుగా ఏర్పడి, వారు అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకున్న పథకం ప్రకారం నేరం జరిగిన రోజు అనగా తేదీ 17.06.2025 రోజున రాత్రి సమయములో తన తోటి నేరస్థుడు A2 నాగరాజు యొక్క కారు స్విఫ్ట్ నెంబర్ AP 28 AZ 0721 యందు హైదరాబాద్ నుండి ఈటూర్ అందరూ కలసి వచ్చి, భాదితురాలు ఒక్కతే ఇంటివద్ద నిద్రపోతుండగా, ఆమె ఇంటివెనకాలగా గోడ దూకి, తమ వెంట తెచ్చుకున్న కట్టర్ తో కరెంట్ కట్ చేసి, ఆమె బయటికి వచ్చిన తరువాత వెంకటేష్ తాను ఆమె దగ్గరికి వెళ్తే గుర్తు పడుతుందని, ప్రకకు నిలబడగా, మిగిలిన నలుగురు వెళ్ళి అందరూ కలిసి ఆమెను గట్టిగా పట్టుకొని, ఆమె మెడలో ఉన్న నల్లపూసల గొలుసు మరియు చేతి గాజులు కట్ చేసి, ఆమె చేతులను చీరతో కట్టి, ఇంట్లో వెతికి, ఇంట్లో ఉన్న నగల డబ్బతో పారిపోయారు.
ఈ రోజు ఉదయం 07.10 .గంటలకు తిరుమలగిరి x రోడ్డు వద్ద నేరస్తులు తాము దొంగిలించిన బంగారం అమ్మడానికి ప్రయత్నిస్తుండగా విచారణ అధికారి శ్రీ E రఘువీర్ రేడ్డి-సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు నాగారం, శ్రీ M ఆయిలయ్య-SI నాగారం, మరియు సిబ్బంది పట్టుబడి చేయగా విచారణ యందు నేరస్తులు తాము చేసిన నేరమును ఒప్పుకొన్నారు. సూర్యాపేట జిల్లా SP K.నరసింహ ఇట్టి కేసు ఛేదించడము సమర్దవంతంగా పని చేసిన సూర్యపేట DSP V.ప్రసన్నకుమార్, E రఘువీర్ రేడ్డి-సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, M ఆయిలయ్య-SI నాగారం, మరియు నాగారం పోలీసు స్టేషన్ సిబ్బందిని అబినంధించారు.
నేరస్తులనుండి స్వాదీనము చేసుకున్నవాటి వివరములు :
1. కారు స్విఫ్ట్ నెంబర్ AP 28 AZ 0721,
2. నల్ల పూసల గొలుసు
3. సెల్ ఫోన్ (05)
4. cutter
బాధిత మహిళా వివరాలు :
నంగునూరి బయ్యమ్మ లేట్ , వయస్సు; 70 సంలు వృత్తి: గృహిణి నివాసము ఈటూర్ గ్రామం
నేరస్తుల వివరములు :
A-1 బోడ వెంకటేష్ 30 సం. నివాసం మేడిపల్లి , హైదరాబాద్ , స్వస్థలం ఈటూర్ గ్రామము నాగారం మండలము
A-2 పోతరాజు నాగరాజు వయస్సు;33 సం.లు, నివాసం మేడిపల్లి, హైదరాబాద్, స్వస్థలం మాలిపురం గ్రామము తిరుమలగిరి మండలము
A-3 ఎడ్ల చంద్రశేఖర్ వయస్సు: 31 స,లు టైల్స్ వర్క్స్ నివాసము : కాంచనపల్లి గ్రామము అడ్డగూడూర్ మండలము యాదాద్రి భువనగిరి
A-4: కొమ్ము సోమయ్య వయస్సు; 40 సం.ల, నివాసం మేడిపల్లి , హైదరాబాద్ , స్వస్థలం మాచిరెడ్డిపల్లి గ్రామము నాగారం మండలము
A-5: వడ్డే పున్నం వయస్సు: 30 స,లుడ్రైవరు నివాసము : మాచిరెడ్డిపల్లి గ్రామము నాగారం మండలము సూర్యపేట జిల్లా, .
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >