Posted on 2025-06-24 16:55:01
4 ఇంక్లైన్ గ్రామపంచాయతీ సెక్యూరిటీకి వినతి పత్రం
బిఆర్ఎస్ 4 ఇంక్లైన్ ఇన్చార్జి బానోత్ రాము నాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
డైలీ భారత్, కొత్తగూడెం: రేగా కాంతారావు ఆదేశానుసారం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో చుంచుపల్లి మండలం 4 ఇంక్లైన్ బిఆర్ఎస్ ఇంచార్జ్ బానోత్ రాము నాయక్ ఆధ్వర్యంలో4 ఇంక్లైన్ పంచాయతీ కార్యదర్శి నర్మదకు సోమవారం వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని పరిష్కరించాలని బానోత్ రాము నాయక్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హత కలిగిన ప్రతీ పేదవాడికి మంజూరు చేయాలని, సైడు కాలవలో చెత్తా చెదారం పిచ్చిమొక్కలు వెంటనే తొలగించి బ్లీచింగ్ పౌడరు చల్లించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగె మంచినీటి బావులు నీటి నిల్వ ఉన్నచోట తక్షణమే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, వీదిలైట్లు వెంటనే వేయించాలని, ఇండ్లలో చెత్తను ప్రతి రోజు సేకరించి డంపుయార్డుకు తరలించాలని డిమాండ్ చేశారు.
దోమల నివారణకు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని, పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాలలో పేరుకు పోయిన అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక పాలనను గాలికి వదిలేసిందని వ్యాఖ్యానించారు. అబద్దాలతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నున్నవత్ వస్య, నున్నవత్ తార, నున్నావత్ వెంకటేష్, భుక్య ధనరాజ బానోత్ నందు, బానోత్ పండు, సురేష్, రామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >