Posted on 2025-06-22 08:54:12
డైలీ భారత్, హనుమకొండ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల నమోదు పెరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వివిధ సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం, రవాణా సదుపాయం, గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేయాల్సిన వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో ఎంతమంది విద్యార్థులు చేరారు, ఇంకా ఎంత మంది చేరనున్నారు, ఏయే కళాశాలల్లో ఎంత మంది విద్యార్థుల సంఖ్య ఉంది, ఎంత మంది బోధనా సిబ్బంది ఉన్నారు, గురుకులాల్లో గత విద్యా సంవత్సరంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, జూనియర్ కళాశాలలకు సమీపంలో ఎన్ని గురుకుల హాస్టల్స్ ఉన్నాయి, కళాశాలలకు బస్ సౌకర్యాలు ఉన్నాయా అని అధికారులు, ప్రిన్సిపాల్స్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలలకు సమీపంలో ఉన్న హాస్టల్స్ లో ఇంకా సీట్లు పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఏయే కళాశాలల్లో చేరారనే వివరాలను తనకు వారం రోజుల్లో నివేదికను అందజేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఇప్పటి వరకూ 1867 ప్రవేశాల సంఖ్య నమోదైయిందన్నారు. ఇంకా నమోదు శాతం పెరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ డిడి నిర్మల, ట్రైబల్ వెల్ఫేర్ డిడి ప్రేమ కళ, బీసీ వెల్ఫేర్ డిడి లక్ష్మణ్, ఆర్టీసీ ఆర్ ఎం ధరమ్ సింగ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Posted On 2025-07-15 20:08:40
Readmore >మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
Posted On 2025-07-15 18:32:29
Readmore >అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల
Posted On 2025-07-15 18:26:31
Readmore >టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు
Posted On 2025-07-15 15:47:23
Readmore >