Posted on 2025-06-22 10:52:22
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన వలస రమేశ్(45) నేత పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండేండ్ల క్రితం కాలు విరగ్గా, వైద్యం కోసం అప్పుచేశాడు
అప్పటినుంచి ఆరోగ్యం సహకరించకపోవడం, పనిచేయలేని స్థితిలో ఉండటంతో మద్యానికి బానిసయ్యాడు. సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేయగా, అవి ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది శనివారం పట్టణంలోని కార్గిల్‌లేక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Posted On 2025-07-15 20:08:40
Readmore >మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
Posted On 2025-07-15 18:32:29
Readmore >అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల
Posted On 2025-07-15 18:26:31
Readmore >టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు
Posted On 2025-07-15 15:47:23
Readmore >