| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

నేరం చేస్తే శిక్షలు తప్పవు,శిక్షలతోనే సమాజంలో మార్పు.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 6,000/- జరిమానా విధిస్తూ బుధవారం సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ కీలక తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.

ముస్తాబాద్ మండలం బద్నకల్ గ్రామానికి చెందిన కస్తూరి రాంరెడ్డి మరియు కస్తూరి కరుణాకర్ రెడ్డి ఇద్దరి మధ్య వ్యవసాయ భూమి సరిహద్దుల గురించి గొడవలు జరుగుతుండేవి వాటిని మనసులో పెట్టుకొని ఎలాగైనా   కస్తూరి కర్ణాకర్ రెడ్డిని చంపాలని కస్తూరి రాంరెడ్డి అతని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. 

పథకం ప్రకారం తేదీ 27.12.2020 రోజున కరుణాకర్ రెడ్డి తన పొలంలో పని చేసుకుంటుండగా కస్తూరి రాంరెడ్డి అతని భార్య మంజుల, ఇద్దరు కుమారులు వెంకటేశ్ , మహేష్ లు అక్కడికి చేరుకుని నలుగురు కలసి కరుణాకర్ రెడ్డి ని గొడ్డలితో నరికి,కట్టెలతో కొట్టి చంపినారు.ఇట్టి కేసులో మృతిని సోదరి పద్మా పిర్యాదు మేరకు ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందుతులను రిమాండ్ కి తరలించారు.

అప్పటి సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా,ఈకేసు విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ రాజేందర్ నాయక్,కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 14 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు.శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్ష్యాలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన A1 to A4 లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి  6000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని , శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

పై కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్,అశ్విన్,అప్పటి సి.ఐ లు సర్వర్,ఉపేందర్, మొగిలి, సిఎంఎస్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు, కోర్ట్ మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్‌,కోర్టు కానిస్టేబుల్ రాజేందర్,దేవేందర్ ప్రస్తుత సి.ఐ నాగేశ్వరరావు,ఎస్.ఐ గణేష్ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Previous చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్
Next గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
ADVERTISEMENT