| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాధకద్రవ్యాలకు దూరంగా ఉండండి-యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారండి : ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

మాధకద్రవ్యాలకు దూరంగా ఉండండి-యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారండి : ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

మత్తుపదార్థాలకు బానిస కాకండి జీవితాలను చిత్తు చేసుకోకండి.

మాధకద్రవ్యాల అవగాహన వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్

జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కళాశాలలో, పాఠశాలలో యోగ వేడుకల్లో పాల్గొని మత్తుపదార్థాల వలన కలుగు ఆనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా  తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలో  విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మాధకద్రవ్యాల అవగాహన వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో  విద్యార్థిని విద్యార్థులతో యోగ కార్యక్రమంలో పాల్గొని మత్తుపదార్థాల వలన కలుగు ఆనర్ధాలపై అవగాహన కల్పించారు. 

ఈకార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Previous కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి.. ఎందుకో తెలుసా..?
Next BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం : లకావత్ గిరిబాబు
ADVERTISEMENT