| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి.. ఎందుకో తెలుసా..?

కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి.. ఎందుకో తెలుసా..?

ప్రియుడితో హనీమూన్ కోసం ఇద్దరు పిల్లలను చంపిన కసాయి తల్లి

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ప్రియుడితో హానీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను కసాయి తల్లి చంపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్కాలి గ్రామంలో చెందిన వసీమ్(30), ముస్కాన్ (24) అనే దంపతులు నవిసిస్తున్నారు. వసీమ్ జీవనోపాధి నిమిత్తం ఛండీగఢ్ లో ఉంటున్నారు. ఈ దంపతులకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఇంట్లో లేకపోవడంతో జునైద్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్‌తో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలు అడ్డుగా ఉండడంతో వారికి కసాయి తల్లి విషమిచ్చి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి

Previous మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీ ఐ అశోక్ రెడ్డిఅశ్వాపురం
Next మాధకద్రవ్యాలకు దూరంగా ఉండండి-యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారండి : ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
ADVERTISEMENT