డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంపోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 20 నుంచి 26 వరకు ఆంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ఉన్నదని ప్రజలందరూ మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఉంటే సమాచారం అందించాలని అదేవిధంగా తమ కుటుంబంలోని వ్యక్తులు చుట్టుపక్కల వారు మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
News
మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీ ఐ అశోక్ రెడ్డిఅశ్వాపురం