Posted on 2025-06-20 07:46:51
డైలీ భారత్, ముంబై: రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక విదేశీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుండి ముంబైకి బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి కాపు కాచి చాకచక్యంగా పట్టుకున్నారు. సదరు నైజీరియన్ మహిళను ఆపి ఆమె సామాను తనిఖీ చేశారు. ఆమె లగేజీని పరిశీలించిన తర్వాత, అధికారులు స్ఫటికాకార పదార్థపు ప్యాకెట్, ఇంకా మాత్రలు కలిగిన ఫుడ్ ప్యాకెట్లు (ఓట్స్), జ్యూస్ టెట్రా ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నారు
NDPS ఫీల్డ్ టెస్ట్ కిట్‌ని ఉపయోగించి ల్యాబ్స్‌లో పరీక్షలు చేయగా ఆ ప్యాకెట్లలో 2.56 కిలోగ్రాముల మెథాంఫేటమిన్, 584 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు ఉన్నట్టు నిర్ధారించారు. తదుపరి ఆపరేషన్‌లో సదరు సరుకును స్వీకరించాల్సిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ అక్రమ మాదకద్రవ్య మార్కెట్‌లో సుమారు రూ. 5 కోట్లుగా అంచనా వేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985లోని సంబంధిత నిబంధనల కింద సరుకు తీసుకోబోయే నైజీరియన్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తదుపరి దర్యాప్తు జరుగుతోంది
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >