| Daily భారత్
Logo




భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కొక్కరికి 2000/- జరిమానా

News

Posted on 2025-06-20 20:24:08

Share: Share


భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కొక్కరికి 2000/- జరిమానా

జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.

నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:భర్త హత్యకు కారణమైన భార్య తో పాటుగా మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కక్కరికి 2000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి  నీరజ శుక్రవారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

వివరాల మేరకు..

ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన దరంసోత్ శంకర్ నాయక్ s/oరామ్ నాయక్ age 55 y అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్య దరంసోత్ సరోజకు పిల్లలు పుట్టడం లేదని రాజవ్వ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు జన్మించారు అప్పటినుండి మొదటి భార్య అయిన దరంసోత్ సరోజ వారిపై పగ పెంచుకొని గొడవలు పడుతూ ఉండేది, వారికున్న ఆస్తి అంతా రెండవ భార్య మరియు వారి సంతానానికి రాసిస్తాడు అనే భయంతో తన భర్త అయినటువంటి శంకర్ నాయక్ ను తేదీ 28.11.2020 రోజున మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సరోజ, ఆమె తమ్ముడైన బానోతు శ్రీనివాస్, చెల్లెలు తేజావత్ లక్ష్మి లను పిలిపించుకొని భర్త శంకర్ నాయక్ కి మందు బాగా తాగించి రోకలిబండతో కొట్టి ముగ్గురు కలిసి చంపినారు.

ఈ కెసులో రెండో భార్య అయినటువంటి రాజవ్వ ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపించడం జరిగింది.తరువాత సిఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. 

కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులైన A1- దరంసోత్ సరోజ, A2- బానోతు శ్రీనివాసు, A3- తేజావత్ లక్ష్మి అను ముగ్గురికి జీవిత ఖైదీతో పాటు ఒక్కొక్కరికి 2000 రూపాయల జరిమానా విధించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సర్వర్, ఉపేందర్, ప్రస్తుత సి.ఐ మొగిలి, ఎస్.ఐ గణేష్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు , కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లను జిల్లా ఎస్పీ  అభినందించారు.

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >