| Daily భారత్
Logo




హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

News

Posted on 2025-12-06 16:17:59

Share: Share


హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:63వ హోమ్ గార్డ్సు రైసింగ్ డే కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య హాజరయ్యారు. ముందుగా హోమ్ గార్డ్స్ పరేడు కార్యక్రమం గౌరవవందనం స్వీకరించి, పరేడ్ కార్యక్రమాన్ని వీక్షించారు.

అనంతరం సిపి మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న ప్రతి హోం గార్డు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1946 డిసెంబర్ 6 న ముంబై లో హోమ్ గార్డ్స్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, హోంగార్డ్సు అంటే కేవలం ఒక విభాగం కాదు అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు ఒక దృఢమైన మద్దతు, మన దేశ సరిహద్దులలో సైన్యంతో పాటు . మన రాష్ట్రాల లోపల పోలీసులు మరియు ఇతర విపత్తు నిర్వాహణ సంస్థలతో కలిసి చేస్తున సేవ  వెలకట్టలేనిది. వీరి సేవలు శాంతి భద్రతలకు, ప్రకృతి విపత్తులకు, రవాణా మరియు ట్రాఫిక్ నిర్వాహణల " ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వీరి పాత్ర అసాధారణమైనది. గతంలో ఎన్నికల బందోబస్తులు. వండుగల నిర్వహణలో, కోవిడ్-19 పరిస్థితులలో వీరి కృషి అనితరసాధ్యం, రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహణ , అన్ని సందర్భాలలో ముందుండి ప్రజలను రక్షించడంలో అమోఘం అనియు, వీరు ప్రధానంగా పోలీస్ శాఖలో చక్కని విధులు నిర్వహించడం జరుగుతుందని, ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో, షీ టీమ్స్ ద్వారా ఆకతాయిల ఆటకట్టడినికి, కళా బృందం ద్వారా, డ్రగ్స్ అసాంఘీక శక్తులు, మూఢనమ్మకాలను తొలగించడానికి మొదలగు పద్దతుల ద్వారా వారి సేవలు సద్వినియోగం చేసుకుంటున్నామని, వీరి కి మెడికల్ గ్రాంట్ రూ॥ 10,000/- చొప్పున 6 గురికి మంజూరు చేయబడిందని, కరోనా సమయంలో 131 మందికి రూ. 5,000/- చొప్పున ఇవ్వడం జరిగిందని, రోజువారి భత్యం 921 /- నుండి 1000/- రూపాయల వరకు పెంచబడిందని , రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సౌకర్యం, డబల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ అందించే ప్రస్తావన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని, వీరి సంక్షేమ చర్యలలో భాగంగా హెచ్.డి.ఎఫ్.సి, ఆక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వైద్య బీమా సౌకర్యలు (రూ॥33,00,000/- వైద్య బీమా కవరేజీ ) కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో విధి నిర్వాహణలో అత్యుతమ సేవలు అందించిన 20 మంది హోమ్ గార్డ్సుకు ప్రశంసా పత్రములు అందజేశారు. వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డ్పు కూడా సిబ్బంది అందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్ (హోమ్ గార్డ్స్ ), శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ),  శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్పేర్ ). ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >
Image 1

ఘనంగా సామాజిక సమరసత దివాస్

Posted On 2025-12-06 15:48:27

Readmore >
Image 1

అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

Posted On 2025-12-06 15:47:25

Readmore >
Image 1

చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

Posted On 2025-12-06 15:34:05

Readmore >
Image 1

ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త

Posted On 2025-12-06 15:33:03

Readmore >
Image 1

సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

Posted On 2025-12-06 15:32:07

Readmore >
Image 1

అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం

Posted On 2025-12-06 15:30:17

Readmore >