Posted on 2025-12-07 08:40:10
డైలీ భారత్ న్యూస్, ఇంటర్నెట్ డెస్క్:పర్యాటక రాష్ట్రం గోవాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గోవాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో దాదాపు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అర్పోరా ( Arpora, Goa) ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 23 మంది మరణించగా అందులో నలుగురు పర్యాటకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయి, సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. అటు సంఘటన స్థలానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపతి మురుము కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే గోవా మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. గోవాలో అగ్ని ప్రమాదం బారిన పడి మరణించిన కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున PMNRF నిధుల నుంచి పరిహారం అందించనున్నట్లు పోస్ట్ పెట్టారు.
#goa #Arpora #beach
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >