Posted on 2025-06-19 19:26:24
కోదాడ పట్టణ పిఎస్ కేసు.
- ఇందులో ఇద్దరు మైనర్స్.
- 11 లక్షల విలువ గల 8 తులా భంగారం, 250 గ్రా.వెండి, 2.20 లక్షల విలువ గల బైక్, 60 వేల విలువ గల మూడు సెల్ ఫోన్స్ సీజ్.
- కోదాడ పట్టణం 4 కేసులు, మునగాల 1 కేసు, నల్గొండ జిల్లాలో నిడమానూరు PS 1 కేసు, వేములపల్లి PS 1 కేసు డిటెక్ట్ చేసి స్వాదినం చేసుకోవడం జరిగినది.
- కోదాడ పట్టణంలో దొంగతనం కేసులో వచ్చిన నగదుతో ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన A1.
- A1 ఫణి చెంద్ పై ఉమ్మడి జిల్లాలో 17 దొంగతనం కేసులు ఉన్నాయి.
డైలీ భారత్, సూర్యాపేట: జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు. ఎస్పి గారి వెంట కోదాడ DSP శ్రీధర్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, ASI హానుమ నాయక్, పోలీసు సిబ్బంది. కేసు చేదనలో బాగా పని చేసిన సిబ్బందిని ఎస్పి గారు అభినందించి రివార్డ్ అందించారు.
నిందితుల వివరాలు :
-- A1 ఇటికాల ఫణి చంద్, వయస్సు 19 సం. లు, కూలి పని, నివాసం: హుజూర్ నగర్, ప్రస్తుతం కోదాడ టౌన్.
-- A2 చేకూరి నాగేంద్రబాబు 25 సంవత్సరాలు వృత్తి ఎలక్ట్రిషన్ నివాసము కోదాడ టౌన్.
-- A3 & A4 మైనర్ బాలురు. (మైనర్ ఐనందున పేర్లు వెల్లడించలేదు)
ఎస్పి మాట్లాడుతూ నిందితులు రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇండ్లని టార్గెట్ చేసి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన బంగారు వెండి ఆభరణములు దొంగలించుకు వెళ్తారు, ఒంటరిగా ఉన్న వృద్ధులను, ఒంటరిగా వాహనంపై ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేసి మహిళలపై గల బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేస్తారు అన్నారు. గత నెలలో కోదాడ పట్టణంలో ఒంటరిగా ఉన్న మహిళ వద్ద చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు, అలాగే మునగాల పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు, కోదాడ ఇన్స్పెక్టర్, మునగాల ఇన్స్పెక్టర్ అధ్వర్యంలో కేసులు దర్యాప్తు చేసినారు. ఇవి రెండు కూడా ఖరీదైన KTM బైక్ పై చేసినట్లు గుర్తించాం అన్నారు. పోలీసు ప్రయత్నాలు చేస్తుండగా నమ్మదగిన సమాచారం పై కోదాడ, హుజూర్ నగర్ పట్టణాలకు చెందిన 4 గురు నిందితులను కోదాడ లో కోదాడ పట్టణ పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగినది. వీనిని విచారించగా దొంగతనాలకు పాల్పడుతునట్లు ఒప్పుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారు వీరిని జూవెనల్ కోర్టుకు హజరారుస్తాము అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కటినంగా చర్యలు తీసుకుంటాం, అలవాటుగా నేరాలకు పాల్పడుతున్న వారిపై షీట్స్ నమోదు చేస్తున్నాము అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరైనా అనుమానితులు తారసపడితే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి అన్నారు.
పట్టుబడి : దొంగతనాలకు పాల్పడిన సొమ్మును, బంగారు, వెండి ఆభరణాలను వాటాలుగా పంచుకొని అమ్ముకొనుటకు గాను ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో A1 ఫణి చంద్ కోదాడ పట్టణంలోని A2 నాగేంద్రబాబు ఇంటికి రాగా నమ్మదగిన సమాచారం పై కోదాడ పట్టణ పోలీసులు వారిని పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. వీరిని విచారించగా దొంగతనాలు ఒప్పుకున్నారు వీరి నుండి మొత్తం 7 కేసుల్లో 11 లక్షల విలువగల 8 తులాల బంగారం, వెండి, ఖరీదైన కెటిఎమ్ బైకు, 60 వేల విలువగల మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగినది. A1 మరియు A2 వ ఇద్దరు పరిచయస్థులు. రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి, ఇంటి తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించి విలువైన బంగారు మరియు వెండి ఆభరణములు దొంగిలించుకొని పోతారు. అదే విధముగా ఒంటరిగా ఉన్న మహిళలపై గల విలువైన బంగారు నగలను లాక్కొని పోతారు.
నిందితుడు A1 ఫణి చంద్ మద్యానికి బానిసై జలసాలకు అలవాటు పడి మిత్రులతో కలిసి దొంగతనాలు చేశారు. A1 పై కోదాడ టౌన్, హుజూర్నగర్, చౌటుప్పల్, అనంతగిరి, నేలకొండపల్లి, మునగాల, మరియు చిలుకూరు, వేములపల్లి, నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసును నమోదై పలుసార్లు జైలుకు వెళ్లి వచ్చినాడు.
కేసును ఛేదించటంలో చాకచక్యత ప్రదర్శించిన కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ కె . శివ శంకర్ ఆధ్వర్యములో SI బి. సుధీర్ కుమార్ , ASI B. హనుమాన్ , HC లు B. శ్రీనివాస్, కరుణాకర్, కృష్ణ , పిసి లు యల్లారెడ్డి, కొండలు, సతీష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ని పర్యవేక్షణ చేసిన కోదాడ DSP యం. శ్రీధర్ రెడ్డి ని సందర్భంగా అభినందించడం రివార్డ్స్ ప్రకటించడం జరిగినది.
Previous Cases on A1- 17 కేసులు కోదాడ టౌన్ PS 3 కేసులు, అనంతగిరి PS 2 కేసులు, మునగాల PS 2 కేసులు, నరేడుచర్ల, నెలకొండపల్లి, చౌటుప్పల్ PS లలో ఒక్కో కేసు ఉన్నది.
ఈరోజు డిటెక్ట్ చేసిన కేసులు : కోదాడ పట్టణం 4 కేసులు, మునగాల 1 కేసు, నల్గొండ జిల్లాలో నిడమానూరు PS 1 కేసు, వేములపల్లి PS 1
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >