Posted on 2025-06-17 13:07:20
డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భర్తల్ని చంపడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. పలువురు మహిళలు తమ భర్తల్ని చంపుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగింది. ఇటీవల మేఘాలయలో రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో భార్య సోమన్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో ఒక వరుడిని పెళ్లి ముందు రోజు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూన్ 15న జరిగింది. వరుడి గ్రామం ధన్‌పూరాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితుడికి, మృతుడికి కాబోయే భార్యతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు సద్దాంను సోమవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హత్యకు గురైన నిహాల్ మొబైల్ ఫోన్‌ని దాచిపెట్టినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. నిహాల్ 15వ తేదీన హత్యకు గురయ్యాడు. హత్య తర్వాత, కొత్వాలి గంజ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు నిహాల్ మొబైల్ స్వాధీనం చేసుకునే క్రమంలో, సద్దాం పోలీసుల వద్ద నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు సద్దాం గాయపడ్డాడు.
వధువు గుల్ఫాషాగా గుర్తించారు. ఈమె, తన లవర్ సద్దాంతో కలిసి నిహాల్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు నిందితుడి స్నేహితుడు కూడా సాయం చేశాడు. ప్రస్తుతం, గుల్ఫాషా, మరో నిందితుడు పరారీలో ఉన్నారు. బాధితుడు నిహాల్ (35) వివాహాలు, పార్టీలకు వంటవాడిగా పనిచేస్తున్నాడు.
భోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల్ఫాషాతో అతని వివాహం నాలుగు నెలల క్రితం నిశ్చయించబడింది. జూన్ 15న వివాహం జరగాల్సి ఉంది, నిహాల్ ఇంట్లో సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 14న వధువు బంధువుగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు కుటుంబీకులు చెప్పారు. దీంతో నిహాల్ ఇద్దరితో కలిసి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు సద్దాం, అతడి అనుచరుడు ఫర్మాన్, అనీస్‌పై కేసు నమోదు చేశారు. గుల్ఫాషా 32 ఏళ్ల పొరుగువాడు సద్దాంతో ఒక సంవత్సరం పాటు ప్రేమలో ఉందని పోలీసులు వెల్లడించారు
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >