Posted on 2025-06-15 16:49:04
గ్రామీణ రహదారులుకు మహర్దశ
పల్లెల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన గత ప్రభుత్వం
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శ
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికొదిలేసింది
రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం అమలు కూటమి ప్రభుత్వం ఘనత
రావివలస గ్రామ పంచాయతీ పరిధిలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన
టెక్కలి మండలం కేంద్రంలో రూ. 13 కోట్ల రూపాయలతో పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధికి శంకుస్థాపన
డైలీ భారత్, శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస పంచాయితీ పరిధిలో పంచాయతీ రాజ్ శాఖ నిధుతో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అయిదేళ్లూ పల్లెల అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని, కనీస మౌళిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు కష్టాలు పడ్డారని విమర్శించారు.
గ్రామాలు అభివృద్ధి దిశగా నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
రావివసల గ్రామ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
రావివలస గ్రామ ప్రధాన వీధిలో రూ.80 లక్షలు, దామో దరపురంలో రూ.90 లక్షలు, చిన్న నారాయణపురంలో రూ.60 లక్షలతో సీసీ రహదా రులు, కాలువలు నిర్మాణ పనులు చేపట్టేందుకు శంకుస్ధాపన చేశారు. అదేవిధంగా పాత కాలనీలో రూ.51 లక్షలు, కొత్త కాలనీలో రూ. 60 లక్షలతో కాలువల ఏర్పాటు శంకుస్ధాపన చేశారు. అలాగే నౌపడ- రహ దారి నుంచి చిన్ననారాయణ పురం గ్రామానికి ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం కోసం రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ.50 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులు శంకుస్ధాపన చేశారు. చిన్ననారాయణపురం ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో రహదారి, రూ.30 లక్షలతో శ్మశానవాటికకు మార్గం, రావివలస, దామోదరపురం, చిన్ననారాయణపురం గ్రామాల్లో శ్మశానవాటికల అభి వృద్ధికి రూ.75 లక్షలు రావివలస నుంచి ఎండలమల్లి కార్జున స్వామి దేవస్థానానికి రూ.3 కోట్లతో రహదారి కొత్తకాలనీలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు, డ్వాక్రా భవనం నిర్మా ణానికి రూ.30 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న పనులకు శంకుస్ధాపన చేశారు.
ఇంటిం టికీ కుళాయిల ద్వారా నీరందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది
గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శించారు.
రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు చేశాం. తల్లుల ఖాతాలో నగదు జమ చేశామని చెప్పారు. రాష్ట్రంలో 67 లక్షల మంది లబ్ధిదారులకు ఖాతాలో నగదు జమ చేశామని చెప్పారు.
తల్లికి వందనం అమలు కూటమి ప్రభుత్వం ఘనత అన్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు తెరిచిన రోజే, పిల్లలకు కొత్త పుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, బూట్లు, సాక్సులు పిల్లలకు అందజేయాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణ మూర్తి,తెదేపా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >