| Daily భారత్
Logo




భద్రాద్రి జిల్లాలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

News

Posted on 2025-06-15 13:44:54

Share: Share


భద్రాద్రి జిల్లాలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

కేక్ కట్, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమంతో పాటు  రక్తదానంతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక మరియు విద్యుత్ శాఖల మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు బాల శౌరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోత్కూరి ధర్మారావు మరియు మాజీ కౌన్సిలర్లు రజాక్ మరియు కాసుల వెంకట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో  కేక్ కట్ చేసి వృద్ధుల సమక్షంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

NSUI  జిల్లా అధ్యక్షుడు అడ్మినా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, పలువురు పార్టీ కార్యకర్తలు, యువకులు రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి స్థానిక ప్రజలు కూడా విశేషంగా స్పందించారు

ఈ సందర్భంగా బాల శౌరి మాట్లాడుతూ, "ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాలతో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలన్నదే మా లక్ష్యం" అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరిలో ప్రశంసను అందుకుంది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం కన్వీనర్ జేబీ శౌరి, టిపిసిసి జనరల్ సెక్రెటరీ మోత్కూరి ధర్మారావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు, టౌన్ కన్వీనర్ మొహ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్,ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నర్సింహారావు,కొత్తగూడెం టౌన్ యూత్ ఉపాధ్యక్షుడు ఎం.డి. ఉస్మాన్, రంజిత్ నాయుడు, షేక్. నాయిమ్, ఎస్ కె. కరీం, కొమురయ్య,దావూద్, మాజీ కౌన్సిలర్లు తంగేళ్ల లక్ష్మణ్, పల్లపు లక్ష్మణ్, ఎండి రజాక్, కాసుల వెంకట్, నిసర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్,ఆదరి కొమురయ్య,తదితరులు పాల్గొన్నారు..

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >