| Daily భారత్
Logo




ఘోర ప్రమాదం... కుప్పకూలిన హెలికాప్టర్

News

Posted on 2025-06-15 06:17:50

Share: Share


ఘోర ప్రమాదం... కుప్పకూలిన హెలికాప్టర్

డైలీ భారత్, డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్‌  లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కేద‌ర్‌నాథ్ ధామ్ నుంచి గుప్తా కాశీ వెళ్తున్న హెలికాప్ట‌ర్ అడ‌విలో కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదానికి గురైన హెలికాప్ట‌ర్‌ను ఆర్య‌న్ ఏవియేష‌న్ సంస్థ‌కు చెందిన‌దిగా అధికారులు గుర్తించారు. గౌరీకుంద్ – సోన్‌ప్ర‌యాగ్ మ‌ధ్య ఉన్న అడ‌వుల్లో హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు తెలిపారు.

ఈ ప్ర‌మాదం ఆదివారం తెల్ల‌వారుజామున 5:20 గంట‌ల‌కు జ‌రిగిన‌ట్లు తెలిపారు. ఈ హెలికాప్ట‌ర్‌లో ఆరుగురు భ‌క్తులు వెళ్తున్న‌ట్లు పేర్కొన్నారు. భ‌క్తుల్లో ఒక చిన్నారి ఉంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ను ఉత్త‌రాఖండ్ సివిల్ ఏవియేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ధృవీక‌రించి, అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన భ‌క్తులు ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌కు చెందిన వార‌ని అధికారులు తేల్చారు. అయితే హెలికాప్ట‌ర్ కుప్ప‌కూల‌డానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల కూలిందా..? లేక వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డమా..? అన్న‌ది తేలాల్సి ఉంది.

అడ‌వుల్లో మేత‌కు ప‌శువుల‌ను తీసుకెళ్లిన కాప‌రులు హెలికాప్ట‌ర్ కూల‌డాన్ని గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల‌తో పాటు పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >