| Daily భారత్
Logo




టి యు సి ఐ రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి : TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు

News

Posted on 2025-06-15 04:42:44

Share: Share


టి యు సి ఐ రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి : TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర మహాసభల ను జయప్రదం చేయండి

TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర మహాసభల ను జయప్రదంచేయయాలని కార్మికులకుTUCI భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు.

శనివారం జూలూరుపాడు లో కెజిబివి పాఠశాల వర్కర్స్ తో కలసి గోడపత్రికలను ఆవిష్కరించారు.అనంతరం గోపాలరావు ‌మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ జూన్ 21 22 తేదీ లో

నిజామబాద్ జిల్లా కేంద్రం లో జరుగుతున్నాయని  జూన్ 21న భారీ కార్మిక  ప్రదర్శన బహిరంగ సభ జరుగుతున్నదని,ఈ బహిరంగ సభలో TUCI ఆల్ ఇండియా  అధ్యక్షులు అమ్రిష్ పటేల్ పాల్గొని ప్రసంగిస్తారని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు .జులై 22న ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ ప్రతినిధుల మహాసభను ఉన్నత విద్య మండలి మాజీచైర్మన్ ఆహ్వానసంగం అధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి  ప్రారంభిస్తారని వారు తెలిపారు 

కస్తూరి భా పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్స్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపెట్టుతున్నాయని ఆరోపించారు.రూ.9700 లతో చాలీ చాలని జీతాల తో అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే  సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ. 26000.లు  

ఇవ్వాలని గోపాలరావు డిమాండ్ చేసారు. 

ఈ సభల్లో ముఖ్యంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా , కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేసే మోడీ ప్రభుత్వ

విధానాలకు వ్యతిరేకంగా, ఈ మాసభల్లో ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదురుకుంటున్న సమస్యలపై చర్చించటం జరుగుతుందని తెలిపారు. ఈ సభలకు తెలంగాణలో కెజిబివి, సింగరేణి, బీడీ, మున్సిపల్, భవన నిర్మాణరంగం, గ్రామపంచాయతీ  మధ్యాహ్న భోజనం, మిషన్ భగీరథ, ఆశ, అంగన్వాడి, తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు ,  దేశంలో సంఘటిత అసంఘటిత రంగం హక్కులను హరించకపోతున్న తరుణంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని  వారి తరఫున టి యు సి ఐ పోరాడుతుందని కనీస వేతనాల చెల్లింపు చట్ట ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించవలసిన ప్రభుత్వాలు 12 సంవత్సరాలు నుంచి కనీస వేతనాలను జీవోలను విడుదల చేయకపోవడం దారుణమైన విషయమని వారు ఆరోపించారు, కనీస పెన్షన్ 9000 రూపాయలు నిర్ణయించాలని, జులై 9న జరిగే దేశ వ్యాప్త  సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని వారు కోరారు 

ఈ  కార్యక్రమంలో అరుణ,రమాదేవి, స్వరూప,నిర్మల, సునీత, కళ్యాణి శిరీష రజిత, స్రవంతి,రాధ తదితరులు పాల్గొన్నారు

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >