Posted on 2025-06-03 15:01:37
డైలీ భారత్, హైదరాబాద్: వేములవాడ రాజన్న ఆలయంలో ఇటీవల కోడెలు మృతిచెందాయి. ఈ సంఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఇచ్చిన కోడెలు మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సంఘటనపై వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు. కోడెల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే కోడెలు మృతిచెందిన సంఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు.
ఇవాళ(మంగళవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమీక్ష చేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం వ్యాధుల వల్ల కోడెలు చనిపోవడం బాధాకరమని తెలిపారు. కొందరు భక్తులు పాలు కూడా మరువని కోడెలను తీసుకువస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తున్నామని వెల్లడించారు. పాత ఆలయం, పాత మండపాలు యధావిధిగా ఉంటాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొందని ఆది శ్రీనివాస్ తెలిపారు. పొత్తు పెట్టుకోకుండా ఉండటానికి బీఆర్ఎస్ ఉండాలి కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కేడర్‌ను మభ్య పెట్టేందుకే మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి కాంగ్రెస్‌ని దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కవిత చెప్పిన దెయ్యాలు ఎవరో హరీష్‌రావు సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీ ఇంటర్నల్ విషయాలు బయటకి చెప్పిన కవితపై చర్యలు తీసుకుంటారా అని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్‌కి అధికారం లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా చేయరా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు.. KP
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >