| Daily భారత్
Logo




నకిలీ విత్తనాలు మరియు వాటిని తయారు చేయు పరికరాలు సీజ్. ముగ్గురు నిందితుల అరెస్ట్

News

Posted on 2025-06-03 17:42:29

Share: Share


నకిలీ విత్తనాలు మరియు వాటిని తయారు చేయు పరికరాలు సీజ్. ముగ్గురు నిందితుల అరెస్ట్

జిల్లా CCS, తిరుమలగిరి పోలీసుల, వ్యవసాయ శాఖ అధ్వర్యంలో తనిఖీలు.

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ.4,62,000/- విలువైన 308 KG నకిలీ పత్తి విత్తనాలు సీజ్. (గడ్డిమందు తట్టుకునే విత్తనాలు అంటూ), వాటిని తయారు చేయు ప్రాస్సెసింగ్ మోటార్ మరియు ప్లాస్టిక్ డ్రమ్ము, యాసిడ్ క్యానులు-15, షైన్ స్టార్ 03- డబ్బాలు స్వాదినం, ముగ్గురు నింధితులను అరెస్ట్ చేసిన తిరుమలగిరి పోలీసులు.

నకిలీ విత్తనాలు అమ్మి వ్యవసాయానికి, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.

రైతులు విత్తన నాణ్యతను తనికి చేసుకోవాలి, వ్య్వసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి, కాంపిణి లేబుల్ ఉన్న విత్తనాలు, నమ్మకమైన డీలర్స్ వద్ద విత్తనాలు కొనుగోలు చేయడం మేలు.

విడి విత్తనాలతో అధిక నష్టం.

K. నరసింహ, ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా

డైలీ భారత్, సూర్యాపేట: జిల్లా పోలీసు కార్యలయం నంధు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐ‌పి‌ఎస్. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవిందర్ రెడ్డి, DSP ప్రసన్న కుమార్, CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, తిరుమలగిరి SI వెంకటేశ్వర్లు, CCS SI హరికృష్ణ, CCS, తిరుమలరి PS సిబ్బంది ఉన్నారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న నింధితుడిని, వాటిని తీసుకపోయి విక్రయిస్తున్న మరో ఇద్దరు నిందితులని తిరుమలగిరి పోలీస్ వారు మంగళవారం రోజున నమ్మదగిన సమాచారం పై ఏ1 నింధితుని కౌలు భూమి నంధు తనికి అరెస్టు చేసినారు,  సుమారు 4,62,000/- లక్షల విలువైన 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Cr.No.116/2025 U/Sec 318(4) BNS, Sec 7 of EC Act. Sec 19 of Seeds Act 1966,  Sec 15(1) of EP Act 1986  ప్రకారముగా కేసు నమోదు. రైతులకు వ్యవసాయానికి నష్టం కలిగే విధంగా నకిలీ విత్తనాలు అమ్మితే భారతీయన న్యాయ సంహిత, నిత్యవసర సరుకుల దుర్వినియోగం చట్టం, ఎనిమల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తాం, PD నమోదు చేస్తాం అన్నారు. ఇలాంటి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి అరుగాలం కష్ట పడి ఒక్కరైతు కూడా నష్టపోవద్దు అని కోరారు.

నిందితుల వివరాలు 

A-1 సింగారపు యాదగిరి స్వామి వయస్సు 50 సంవత్సరాలు, Occ అగ్రికల్చర్ R/o కోటిలింగాల కాలనీ, తిరుమలగిరి మున్సిపాలిటీ మరియు మండలం, సూర్యాపేట జిల్లా. 

A-2. లొడంగి నవీన్ వయస్సు 25 సంవత్సరాలు, Occ అగ్రికల్చర్ R/o నందపురం గ్రామం తిరుమలగిరి మున్సిపాలిటీ మరియు మండలం, సూర్యాపేట జిల్లా 

A-3.చిత్తలూరి సోమనారాయణ, వయస్సు 60 సంవత్సరాలు, Occ వ్యవసాయం R/o చిర్రగూడూరు గ్రామం అడ్డగూడూరు మండలం, యాదాద్రి భోనగిరి జిల్లా

సూర్యపేట జిల్లా , తిరుమలగిరి టౌన్ మరియు మండలానికి  చెందిన సింగారపు యాదగిరిస్వామి తండ్రి రంగయ్య అను వ్యక్తి తిరుమలగిరి శివారులో తన భూమి చుట్టు ఉన్న వారి భూములు కౌలుకు తీసుకొని, ప్రత్తి పంట సాగు చేసుకుంటూ, ఎక్కువ దిగుబడి రాక, పండించిన పత్తి నుండి గింజలు వేరు చేసి, వాటిని పత్తి విత్తనాలు తయారు చేయవచ్చు అని యూట్యూబ్ లో చూసినాడు, ఆ విదంగా చేసి వాటిని ఒరిజినల్ BT III విత్తనాలు అని నమ్మించి రైతులకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలని ఉద్దేశంతో, అతను అనుకున్న ప్రకారం అతను పండించిన పత్తి నుండి పత్తి గింజలు తీసి, నకిలీ పత్తి విత్తనాలు తయారు చేయడానికి కావలసిన సామగ్రి, అనగా 3 ఫేజ్ ½ HP మోటార్, దానిని కలపడానికి డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యానులు మరియు పత్తి గింజలు రంగు రావడానికి షైన్ స్టార్ డబ్బాలు తీసుకవచ్చి, ఎవ్వరికీ అనుమానం రాకుండా అతను లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమి వద్ద పెట్టి, సుమారు 308 KG ల పై చిలుకు నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసినాడు. అతని పరిచయం ఉన్న నందాపురం గ్రామానికి చెందిన నవీన్ మరియు చిర్రగూడూరు గ్రామానికి చెందిన సోమనరాయణలకు కలిసి, అతని వద్ద పత్తి గింజలు ఉన్నాయి, వాటిని తయారు చేసినాను, ఎక్కువ దిగుబడి వస్తాయి, కంపెనీకి కన్నా తక్కువ రేటుకు ప్యాకెట్ 1500 రూపాయలకు అమ్ముతాను, వాటిని తీసుకపోయి ఎక్కువ రేటుకు అమ్ముకొమ్మని చెప్పి, వారికి మొదటగా 10 కేజీల చొప్పున ఇద్దరికీ ఇచ్చినాడు, వారు వాటిని అమ్మి, మళ్ళీ కావాలి అని చెప్పడంతో లోడంగి నవీన్ కు మరొక 50 KG లు మరియు చిత్తలూరి సోమ నారాయణ కి కూడా 40 KG ల నకిలీ విత్తనాలు అమ్మినాడు, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో తిరుమలగిరి పోలిస్ వారు నిందితుల వ్యవసాయ భూముల వద్ద మరియు ఇండ్లలో దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలతో పాటు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు స్వాదినం చేసుకుని ముగ్గురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు.

నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్

అన్నదాతను నమ్మించి మోసం చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని. ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని సూర్యాపేట జిల్లా SP K. నరసింహ IPS తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల నివారణకోసం, గుర్తింపు కోసం లా అండ్ ఆర్డర్ పోలీసు తో పాటుగా CCS టీమ్ పని చేస్తుంది, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నాము, గతంలో ఈ రకమైన నేరాలకు పాల్పడ్డ నిందితులపై కూడా దృష్టి పెట్టాం, అలవాటుగా నకిలీ విత్తనాల సరఫరా చేస్తూ నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ తప్పదు అని ఎస్పి హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులో బాగా పని చేసిన CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, SI హరికృష్ణ, ASI వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ లు విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కర్ణాకర్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల ఉన్నారు, తిరుమలగిరి పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >
Image 1

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:06:39

Readmore >
Image 1

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:05:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >