Posted on 2025-05-29 14:10:29
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంచే ఉపాధ్యాయ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న హిందీ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను SCERT డైరెక్టర్ గాజర్ల రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు చక్కగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని డిజిటల్ సాధనాలతో సమ్మిళితం చేసుకుంటూ విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించి వారి అభ్యసనం సులభతరం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు అభ్యసించడానికి వస్తున్నారని వారి కోసం ఉపాధ్యాయులు త్రికరణ శుద్ధిగా విధులు నిర్వహిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయాలని, ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని పేర్కొంటూ బోధనా పద్ధతుల్లో డిజిటల్ వినియోగ మెలకువలు నేర్పించే ఈ శిక్షణ తరగతుల్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ కి మరియు ఈ శిక్షణా తరగతుల్లో రిసోర్స్ పర్సన్స్ గా విధులు నిర్వహిస్తున్న పోర్ల వేణుగోపాలరావు, శ్రీరాం మనోహర్, పర్కాల రవీందర్, అబ్దుల్ రవూఫ్ లను ప్రశంసిస్తూ సన్మానించారు.
శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కోర్స్ కోఆర్డినేటర్ శ్రీమతి శైలజ మరియు హిందీ విషయ ఉపాధ్యాయ శిక్షణా కేంద్ర అధికారి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డా. చకినాల శ్రీనివాస్ ను అభినందించి సత్కరించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >