| Daily భారత్
Logo




విద్యారంగానికి మాటలు కాదు బడ్జెట్ కావాలి : టిపిటిఎఫ్ జిల్లాఉపాద్యక్శులు మండల సాంబయ్య.

News

Posted on 2025-05-29 14:36:51

Share: Share


విద్యారంగానికి మాటలు కాదు బడ్జెట్ కావాలి : టిపిటిఎఫ్ జిల్లాఉపాద్యక్శులు మండల సాంబయ్య.

డైలీ భారత్, మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతామని నోటిమాటలు తప్ప ఆచరణ ఉండటం లేదని, ఇస్తున్న హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల సాంబయ్య అన్నారు.

 ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవం కొత్తగూడ, గంగారం మండలాల బాధ్యులు తీగల రమేష్, మేడ నరసింహారావు, అయిలబోయున శ్రీకళ గారాల ఆధ్వర్యంలో కొత్తగూడ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ వద్ద టీపీటీఎఫ్ జెండాను ఎగురవేశారు.

 అనంతరం సాంబయ్య మాట్లాడుతూ విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి అందులో సగం మాత్రమే ఇస్తున్నారని మాటకు, చేతులకు పొంతన ఉండడం లేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్తరకం పాఠశాలను నెలకొల్పి అప్పటికే ఉన్న పాఠశాలను బలి పెడుతున్నారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సమీకృత గురుకులాలు, యంగ్ ఇండియా స్కూల్లకు పిల్లలను ఎక్కడినుండి తెస్తారని ప్రశ్నించారు. గ్రామాలలో ఉన్న బడులలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా పట్టణ ప్రాంతాలలో ఆకాశ హార్మాలు నిర్మిస్తే అందరికీ విద్య అనే ప్రాథమిక హక్కు కు తూట్లు పొడిచినట్లెనని అన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించి టీచర్ల ఏకాగ్రత ,శ్రద్ధ పిల్లల మీద మాత్రమే పెట్టే ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అడిగితే ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. బడిబాటను మొక్కుబడిగా కాకుండా ప్రజా ప్రతినిధులు అధికారుల భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు యాదగిరి, రవి ,భరత్, సూర్యనారాయణ ,రమేష్, సాంబయ్య ,ప్రశాంత్ పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >