| Daily భారత్
Logo




ప్రియుడితో పారిపోయేందుకు వృద్ధుడిని హత్య... మాములు స్కెచ్ కాదు

News

Posted on 2025-05-29 05:59:55

Share: Share


ప్రియుడితో పారిపోయేందుకు వృద్ధుడిని హత్య... మాములు స్కెచ్ కాదు

డైలీ భారత్, గుజరాత్: గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు మామూలు స్కెచ్ వేయలేదు. గీతా అహిర్(22)కు భరత్ (21)తో వివాహేతర సంబంధం ఉంది. దూరంగా వెళ్లి బతకాలని వారు అనుకున్నారు. ఈ క్రమంలో హర్జీభాయ్ సోలంకీ(56)ని చంపి, మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు.

గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు ఓ వృద్ధుడిని హత్య చేసి చివరికి పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జఖోట్రాకు చెందిన వివాహిత గీతా అహిర్(22)కు భరత్ (21)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో వీరిద్దరూ దూరంగా వెళ్లి బతకాలని అనుకున్నారు. లేచిపోతే కచ్చింతగా దొరికిపోతామని గీత స్కెచ్ వేసింది. తెలుగుతో పాటుగా ఇతర బాషల్లో బాగా పాపులర్ అయిన దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుని తాను చనిపోయినట్టుగా  ఓ సీన్ క్రియేట్ చేసి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది. ప్లాన్ ప్రకారం రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడికి భరత్ లిప్ట్ ఇచ్చాడు.  నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు.

ఓ రాత్రి అతన్ని శవాన్ని చెరువు వద్దకు తీసుకువెళ్లారు.  అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి పెట్రోల్ తీసుకుని బయటకు వచ్చిన గీత వృద్ధుడి మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి పెట్రోల్ తో  తగలబెట్టారు. మర్నాడు ఉదయం సగం కాలిన శవాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన భార్య కనిపించడం లేదంటూ గీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెరువు దగ్గర కనిపించిన ఓ శవానికి గీత దుస్తులు, పట్టీలు కనిపించడంతో అది చూసి గీత భర్త ఇది తన భార్య శవమేనని భావించారు. కానీ పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. రాజస్థాన్‌కు పారిపోయే ముందు పాలన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రేమ జంట పట్టుబడింది.  స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది

Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >