| Daily భారత్
Logo




శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్

News

Posted on 2025-05-28 20:20:11

Share: Share


శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్

-పిల్లల అక్రమ రవాణా, అక్రమ దత్తత ముఠా అరెస్టు. 

-13 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్న సూర్యాపేట పోలీసులు. 

-10 మంది పిల్లలను గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకుని సంరక్షణా కేంద్రానికి పంపడం జరిగింది. ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు.

-దీని వెనుక ఉన్న నిందితుల కోసం మరియు వాస్తవ తల్లిదండ్రుల కోసం దర్యాప్తు కొనసాగుతుంది.

-సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు జువెనల్ జస్టిస్ ఆక్ట్ 2015 ప్రకారం కేసు నమోదు.

డైలీ భారత్, సూర్యాపేట:పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం నేరం. పిల్లలు లేని వారు దత్తత తీసుకోవడానికి చట్టప్రకారం ముందుకు వెళ్ళాలి. భారతదేశంలో చట్టప్రకారం దత్తత తీసుకుని వీలు ఉన్నది, హిందూ అడాప్షన్ అండ్ మెంటేనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం, జువెనాల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్  2015 ప్రకారం దత్తత తీసుకోవచ్చు. పిల్లలు లేని తలిదండ్రులు అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కి ధరకాస్తు చేసుకుంటే సంభందిత సంస్థ వారు ఎంక్వరి చేసి దత్తత తీసుకోవడానికి అన్నీ అవకాశాలు ఉంటే తల్లిదండ్రులు చట్టప్రకారం దత్తత తీసుకోవచ్చు అని ఎస్పీ గారు తెలిపినారు. పిల్లల అక్రమ రవాణా, అక్రమ దత్తత కేసును జిల్లా చైల్డ్ ప్రోటక్ష్ అధికారులు, సూర్యపేట రూరల్ పోలీసు, CCS పోలీసులు సంయుక్తంగా ఛేదించారు అని ఎస్పీ తెలిపారు

తేది: 28-05-2025 న 13 మంది సభ్యులు కలిగిన పిల్లల అక్రమ రవాణా, అక్రమ దత్తత ముఠాను అరెస్టు చేయడం జరిగినది,  సూర్యాపేట & నల్గొండ జిల్లాలకు చెందిన  వివిధ గ్రామాల నుండి (07) మంది మగ శిశువులు, (03) మంది ఆడ శిశువులను సంరస్ఖించడం జరిగినది. టేకుమట్ల (02) బాలురు శిశువులు, సూర్యాపేట పట్టణం (02) బాలికల శిశువులు, పెన్‌పహాడ్ (01) బాలుర శిశువులు, సూర్యాపేట జిల్లా ఉప్పలపహాడ్ (02) బాలుర శిశువులు, నల్గొండ జిల్లాకు చెందిన చిన్న సూరారం (01) బాలిక శిశువు మరియు హైదరాబాద్ (01) బాలుర శిశువులను రక్షించారు. పిల్లలందరినీ నల్గొండలోని బాలల సంక్షేమ కేంద్రానికి అప్పగించడమ్  జరిగినది. 13 మండి నింధితులను రిమాండ్ కు తరలించడం జరిగినది. ప్రదానంగా చూసినట్లైతే సూర్యాపేట పట్టణంలోని యాదగిరి మరియు ఉమా రాణి అనే ఒక వ్యక్తి గుడ్ల పంపిణీ వృత్తిని చేస్తూ పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి తెలుసు కొని , ఆడ/మగ శిశువు లను బట్టి  వారి కమీషన్ 10 వేల నుండి 2 లక్షల వరకు కలిపి మొత్తం 5 నుండి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకొని అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలను వారికి అందించేవారు. పైన పేర్కొన్న గ్రామాలను సందర్శించి, ఏ3  నింధితుల ద్వారా మద్యవర్తిత్వం ద్వారా పిల్లలు  లేని తల్లిదండ్రులకు పిల్లలను అక్రమంగా దత్తత ఇచ్చేవారు. మహారాస్త్ర, గుజరాత్ రస్త్రాల నుండి సంభందం ఉన్నట్లు మూలాలు ఉన్నట్లు గుర్తించాము. ఏ6, ఏ8, ఏ9, ఏ10, ఏ11 నింధితులపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగాం, CID ముంబాయి లలో ఇలాంటి కేసులు ఉన్నాయి. 

నిందితుల అరెస్టు: 

తేది: 28-05-2025 న ఉదయం 10 గంటలకు అక్రమ దత్తతలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా దత్తత తెసుకున్న దత్తత తీసుకున్న ఇద్దరినీ ఆధుపులోకి తీసుకుని  వారి ఒప్పుకోలు ఆధారంగా నిందితులు A-1 & A-2 లను అరెస్టు చేయడం జరిగినది. అదే విధంగా అక్రమ దత్తత గురించి చర్చించడానికి శిశువుల అక్రమ రవాణా ముఠా బృందం సూర్యాపేటకు వచ్చారని, వారు ఇప్పుడు సూర్యాపేటలోని హైటెక్ బస్ స్టాండ్‌లో అందుబాటులో ఉన్నారని తెలుపగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులు A-3 నుండి A-13 వరకు అరెస్టు చేయడం జరిగినది తదుపరి నెరస్థులను  గౌరవనీయులైన JFCM కోర్టు, సూర్యాపేట ముందు హాజరు పరుచడం జరుగుతుంది.  ఇంకా ఈకేసులో దీని వెనుక ఉన్న నింధితులను మరియు వాస్తవ తల్లిదండ్రుల గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతుంది.

సూర్యాపేట డిఎస్పీ నేతృత్వంలో పై నిందితులను పట్టుకోవడం లో ప్రతిభ కనపర్చిన CCS సూర్యాపేట పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. శివ కుమార్, సర్కిల్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి. రాజశేఖర్, సూర్యాపేట రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్, CCS SI పి. హరి కృష్ణ, సూర్యాపేట రూరల్ SI బాలు నాయక్, పెన్ పహాడ్ పోలీస్ ఎస్ఐ కె. గోపి కృష్ణ, చివ్వెంల పోలీస్ ఎస్ఐ వి. మహేష్ మరియు CCS  సిబ్బంది లను జిల్లా పోలీస్ అధికారి కె. నరసింహ అభినందిచారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >