Posted on 2025-05-28 19:05:03
డైలీ భారత్, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కినంత మాత్రాన ఎలాంటి హక్కు లేదా టైటిల్ సంక్రమించదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమి వర్గీకరణ, పంటల స్వభావం, భూమి శిస్తు (పన్ను) కోసం మాత్రమే పహాణీల్లో పేర్ల నమోదు లేదా రెవెన్యూ ఎంట్రీలు ఉపయోగపడతాయని పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలను ఎప్పుడూ రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌ఓఆర్)గా భావించరాదని తెలిపింది. రెవెన్యూ ఎంట్రీల వల్ల ఎలాంటి హక్కులు సంక్రమించబోవని, ప్రస్తుతం ఉన్న హక్కులు హరించుకొని పోవని పేర్కొంది. భూమిపై హక్కు ఎవరిది అనేది సంబంధిత సివిల్ కోర్టులోనే తేలుతుందని స్పష్టంచేసింది. పెద్దపల్లిలోని ఓదెల గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన 14.05 ఎకరాల భూమికి సంబంధించి 2018లో పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీచేసి.. ఆ తర్వాత తమ పేర్లను తొలగించడం చెల్లదని పేర్కొంటూ ఆలయ పూజారి ఆరుట్ల నర్సింహాచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. ఆ వివాదాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని సూచించింది.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >