Posted on 2025-05-27 15:32:57
హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్ స్వాధీనం.
2023 సం.లో హత్య కేసులో,దొంగతనం,బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా మనోజ్.
పలు కేసులలో నిందుతుడిగా ఉండి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మనోజ్ పై 2024 సంవత్సరంలో రౌడి షీట్ ఓపెన్.
పలు కేసుల్లో నిందుతునిగా ఉన్న మనోజ్ కి కోర్టు ద్వారా త్వరగతిన శిక్షలు పడే విధంగా కృషి.
పాత నేరస్థులు తరచు నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.,
చందుర్తి మండల పరిధిలోని మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఈ రోజున ఒక ప్రకటనలో వెల్లడించిన జిల్లా ఎస్పీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: చందుర్తి మండలనికి చెందిన బొల్లు మల్లవ్వ age:57 అను వారికి బొల్లు మనోజ్ s/o స్వామి age:20y అనే వారికి గత కొంత కాలంగా భూమి విషయంలో గొడవలు జరుగగా ఎలాగైనా బొల్లు మల్లవ్వ అనే వారి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో బొల్లు మనోజ్ తల్లి అయిన మోహినవ్వా @మల్లవ్వ ప్రోత్సాహంతో కక్ష్యపూరితంగా బొల్లు మనోజ్ నిన్నటి రోజున సాయంత్రం వ్యవసాయ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే దారిలో చందుర్తి మండలం పెద్దమ్మ గుడి సమీపంలో కొబ్బరి బొండాలు కొట్టే కత్తి తో బొల్లు మల్లవ్వ పై దాడికి పాల్పడి హత్య చేసి చందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోగా చందుర్తి పోలీసులు హత్య చేసిన బొల్లు మనోజ్ అతన్ని ప్రోత్సాహించిన తల్లి మోహినవ్వా లపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి హత్య కు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.
2023 సం.లో హత్య కేసులో, దొంగతనం,బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా ఉన్న మనోజ్ ని గతంలో రెండు కేసులల్లో జువైనల్ హోమ్ కి మరియు రెండు కేసులలో రిమాండ్ చేయడం జరిగిందని,పై కేసులు కోర్టులో ట్రయల్ నందు ఉన్నందున కోర్టు మానిటరింగ్ సిస్టం బలోపేతం చేసే తగరచు రివ్యూ చేస్తూ నింధితునికి శిక్షలు పడే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తుదన్నారు.పలు కేసులల్లో నిందుతుడిగా ఉండి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న మనోజ్ అనే వ్యక్తి పై 2024 సంవత్సరంలో రౌడి షీట్ ఓపెన్ చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగిదని పలు మార్లు చందుర్తి పోలీస్ వారి ఆధ్వర్యంలో సత్ప్రవర్తనతో మెలగాలని పలు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
నిందుతులు వివరాలు.
1.బొల్లు మనోజ్ s/o స్వామి age:20y,చందుర్తి.
2.మోహినవ్వా @మల్లవ్వ age:52,చందుర్తి.
పాత కేసులల్లో నిందితులుగా ఉండి తరచు నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయాబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో రౌడి షీటర్స్ పై నిరంతరం నిఘా కఠినతరం చేయడం జరుగుతుందని తెలిపారు.
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >