Posted on 2025-05-27 14:39:04
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసింది. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులతో సహా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంలో నివాసముండే కిషన్-శిరీష దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల గొడవలు మరింత ముదరడంతో ఇంటినుంచి బయటకు వచ్చి హిల్స్ కాలనీలో శిరీష ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ‘‘సరే జరిగిందేదో జరిగింది.. ఓసారి ఇంటికి రా మాట్లాడుకుందాం’’ అని భర్తను ఇంటికి పిలిచింది. అనంతరం ఇద్దరి సాయంతో చున్నీతో ఉరి వేసి చంపింది. కిషన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శిరీష సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం కిషన్-శిరీష లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >