| Daily భారత్
Logo




పాలిసెట్ నందు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని శ్రీజ ను అభినందించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

News

Posted on 2025-05-26 18:08:28

Share: Share


పాలిసెట్ నందు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని శ్రీజ ను అభినందించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించిన మిర్యాల గ్రామ విద్యార్థిని శ్రీజ ను అభినందించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

లక్ష్యం పెట్టుకుని చదివితే ఏదైనా సాధించవచ్చు - జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

డైలీ భారత్, సూర్యాపేట: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. పదవ తరగతి అనంతరం నిర్వహించే రాష్ట్రస్థాయి పాలిసెట్ నందు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నూతనకల్ మండలం, మిర్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీజ ను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు అభినందించారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదవాలని అన్నారు. 10వ తరగతి తర్వాత ఎంచుకునే లక్ష్యం విద్యార్థులను ఉన్నతమైన గమ్యం వైపు నడిపిస్తుంది, ఇష్టమైన రంగంలో రాణించడానికి, మంచు భవిష్యత్తుకుచి పునాది అవుతుంది అన్నారు. గురువుల సూచనలు పాటిస్తూ, తల్లిదడ్రుల కళలను సాకారం చేయాలని అన్నారు. వివిధ రంగాల్లో దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తుల జీవిత విజయాలను స్పూర్తి తీసుకోవాలని తెలిపినారు.

ఈ కార్యక్రమం నందు ఎస్పి వెంట AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, విద్యార్థిని తండ్రి మధుసూధన్ రావు, స్నేహితులు, పోలీసు సిబ్బంది ఉన్నారు


తదుపరి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి... 

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ...

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత వారసులదే

విస్మరించినట్లు ఫిర్యాదులు వస్తె చట్టపరంగా చర్యలు తప్పవు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ  ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ అన్నారు.  సోమవారం  జిల్లా పోలీస్  కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడి వారి  అర్జిలను పరిశీలించారు.  పిర్యాదుదారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ ఆదేశించారు.

నవమాసాలు మోసి జన్మనిచ్చి, పెంచి, విద్యాబుద్దులు నేర్పి, కష్టపడి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను వృద్దాప్యంలో పోషించకుండా వదిలివేయడం చట్టపరంగా నేరం అని ఎస్పీ అన్నారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ వారసులపై ఉన్నది, బాధ్యతను విస్మరించి ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదులు వస్తె సీనియర్ సిటిజన్ యాక్ట్, నూతన చట్టాల ప్రకారం చర్యలు తప్పవు అని ఎస్పీ హెచ్చరించారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >