Posted on 2025-05-20 07:23:32
డైలీ భారత్, మహబూబాబాద్: మృతుడు లకావత్ బాలా , తండ్రి రాములు , ౩౦ సంవత్సరాలు , లంబాడ, డ్రైవర్ ,నివాసం: ప్రస్తుతం హైదరాబాద్ N/o భల్లార్ష, మహారాష్ట్ర కేసముద్రం మండలం ధర్మారం తండాకు చెందిన బానోత్ వీరన్న తన కూతురు మౌనికకు గత తొమ్మిది సంవత్సరాల క్రితం బల్హర్ష ప్రాంతానికి చెందిన లకావత్ బాల అను వ్యక్తితో పెళ్లి చేసినాడు, వారికి ఇద్దరు కుమారులు. గత 5 సం,,ల నుండి భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాదులో పని చేసుకుంటూ నివసిస్తూన్నారు. ఈ క్రమంలో మృతుని భార్య మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే విషయంలో గొడవలు జరిగే క్రమంలో మృతుని భార్య మౌనిక ధర్మారం తండాలోని తన తల్లిదండ్రుల ఇంటికి రాగా, ఇట్టి విషయంలో తేదీ:17/5/2025 రోజున సాయంత్రం మృతుడు అగు లకావత్ బాల మరియు తన అన్న లకావత్ బావుసింగ్ లు ఇద్దరు ధర్మారం తండాకు వెళ్లి బాల తన భార్య అక్రమ సంబంధం విషయంలో గొడవ పడుచుండగా ఇంతలో తన భార్య మరియు అత్తమామలు అందరూ గొడవపడి మృతుడిని చంపాలనే ఉద్దేశంతో మృతుడి కళ్ళల్లో కారం చల్లి, చేతులతో కొట్టి, మామ బానోత్ వీరన్న కత్తితో మృతిని ఛాతి ఎడమవైపున పొడవగా రక్త గాయాలతో ఉన్న మృతుడిని అంబులెన్స్ లో మహాబుబాబ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అదే రాత్రి 10 గంటల సమయంలో చనిపోయినాడు .
నిందితుల వివరాలు :
A1.బానోత్ వీరన్న s/o మున్య (లేట్), 55 సo.రాలు, లంబాడ, వ్యవసాయం
A2. లకవాత్ @ బానోత్ మౌనిక , w/o బాల , 24 సం, గృహిని
A3. బానోత్ కైల w/o వీరన్న , 45 సం, కూలి
ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన విషయంలో ప్రతిబ కనపరచిన మహబూబాబాద్ రూరల్ సర్కిల్ CI P.సర్వయ్య గారిని, కేసముద్రం SI G.మురళీధర్ , PSI K.రవికిరణ్ మరియు సిబ్బంది ఐలయ్య, రాజు, వెంకన్న, రాజేందర్ లను శ్రీయుత గౌరవ SP, మహబూబాబాద్ గారు అభినందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >