| Daily భారత్
Logo




పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత

News

Posted on 2025-05-12 14:27:44

Share: Share


పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత

చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్న  కానిస్టేబుల్ రాంబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగినది. దివంగత పోలీసు సిబ్బంది కుటుంబాల అవసరాలు తీర్చడం లో భాగంగా పోలీసు చేయూత పథకం ద్వారా కానిస్టేబుల్ రాంబాబు కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల పోలీసు చేయూత పథకం చెక్కును ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు రాంబాబు కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు  శాఖ కృషి చేస్తుంది. రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని ఎస్పి తెలిపినారు. చేయూత పథకం నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బంది ప్రతి నెల జీతం నుండి విరాళం అందిస్తున్నారు అని అభినందించారు, పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు అన్నారు. 

ఈ కార్యక్రమం నందు AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి గారు, సెప్షల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, వెల్ఫేర్ RSI సాయిరాం, కుటుంబ సభ్యులు కిరణ్, సంఘం సభ్యులు  పాల్గొన్నారు.

పోలీస్ ప్రజావాణి కార్యక్రమం.

పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ శ్రీ. కె నరసింహ ఐపిఎస్

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ  ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ అన్నారు. 

సోమవారం  జిల్లా పోలీస్  కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడి వారి  అర్జిలను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఎస్పీ గారు ఎస్పి గారు మాట్లాడుతూ  పిర్యాదుదారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ ఆదేశించారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >