Posted on 2025-05-09 18:09:26
డైలీ భారత్, ఢిల్లీ: ఇటీవల కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద చర్య తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది భారతీయుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. అమాయక హిందూ యాత్రికులపై జరిగిన దాడి ప్రతి భారతీయుని మనసును కలిచి వేసింది. ఈ దారుణ ఘటనపై భారత్ రివేంజ్ తీర్చుకుంటోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పీఓకే శిబిరాలపై దాడి చేసిన భారత్, తాజాగా పాకిస్తాన్పై డ్రోన్లతో మరో దాడి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది.
ఆర్ఎస్ఎస్ ఈ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు అభినందనలు తెలిపింది. దేశ భద్రతను కాపాడేందుకు తీసుకున్న ప్రతి చర్యను ధైర్యంగా సమర్థించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే శక్తులపై భారత సైన్యం చేపట్టిన కౌంటర్ యాక్షన్ సముచితమని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు భారతదేశ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమని, ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబాలకు, ఘటనలతో న్యాయం జరిగిందని తెలిపింది. ఇలాంటి నిర్ణయాలు దేశంలోని ప్రతి పౌరుని భద్రతా భావాన్ని బలపరుస్తున్నాయని ఆర్ఎస్ఎస్ వెల్లడించింది.
పాకిస్తాన్ గతంలో పుల్వామా, ఉరి, పఠాన్‌కోట్ వంటి ఘటనల్లో పిరికి దాడులకు పాల్పడింది. అయితే ఇప్పుడు భారత సైన్యం మాత్రం ఉగ్రవాదానికి తగిన రీతిలో ప్రతిస్పందిస్తుంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, వారికి సహకరిస్తున్న వ్యవస్థలపై దాడులు చేయడం అనివార్యం. ఉగ్రవాదానికి ఆధారంగా మారుతున్న ప్రాంతాలపై చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవచ్చని వెల్లడించింది. ఇది కేవలం ప్రతీకారం కాదని, భద్రతా చర్య అని ఆర్ఎస్ఎస్ చెప్పింది.
దేశ భద్రత, ఆత్మగౌరవం, నైతిక విలువలు కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలని ఆర్ఎస్ఎస్ కోరింది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే లేదా పనులు చేసే శక్తులకు అడ్డుగా నిలవాలన్నారు. సైన్యం మన కోసం ప్రాణాలు అర్పిస్తుంటే, మనం వారి ధైర్యాన్ని అభినందించడమే కాదు, వారికి వెన్నుదన్నుగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెల్లడించింది. శాంతి అంటే క్షమాపణ కాదని, న్యాయం జరిగేలా చూడటమని తెలిపింది. ఆ దిశగా భారత ప్రభుత్వం, సాయుధ దళాలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించింది.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >