Posted on 2026-04-27 18:15:44
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని గోసంగీ కాలనీలో చోటుచేసుకున్న హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితురాలిని అరెస్ట్ చేశారు.
తేదీ 25.04.2026 న మృతుడి అన్న కోదండం సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. అదే రోజు రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో మెడపై దాడి చేయగా, అతను తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది.
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, రక్తపు నమూనాలు మరియు ఇతర భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విశ్వసనీయ సమాచారం మేరకు తేదీ 27.04.2026 న కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద నిందితురాలు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు, హత్యకు ఉపయోగించిన కొడవలి మరియు రక్తపు మరకలతో ఉన్న చీరను చూపించగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో మృతుడు మద్యం సేవించడం, జూదం అలవాటు, అలాగే కుటుంబ సమస్యలపై తరచూ భార్యను వేధించడం వలన ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిసింది. 25.04.2026 న జరిగిన ఘర్షణలో నిందితురాలు ఆవేశానికి లోనై ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది.
ఈ కేసును కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ బి. నరహరి సమర్థవంతంగా విచారించి నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >