| Daily భారత్
Logo




అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

News

Posted on 2026-04-27 18:36:35

Share: Share


అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

పారదర్శకత కోరుతున్న జర్నలిస్టులు

ఇండ్ల మహేష్.. రిపోర్టర్

డైలీ భారత్, మహబూబాబాద్: జిల్లాలో 2026–28 కాలానికి సంబంధించి మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు ప్రక్రియపై జర్నలిస్టుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2022–25 కమిటీ సమయంలో అర్హులైన పలువురికి అవకాశాలు దక్కలేదని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే ఈ కమిటీ ఎంపిక విధానం పారదర్శకంగా లేదని కొందరు జర్నలిస్టులు అంటున్నారు. ఫీల్డ్‌లో పనిచేసే జర్నలిస్టుల కంటే పరిచయాలు, ప్రభావం ఉన్నవారికే ప్రాధాన్యం లభించే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇక కమిటీ సభ్యుల వివరాలు బహిరంగంగా వెల్లడించకపోవడం మరింత సందేహాలకు దారితీస్తోందని పేర్కొంటున్నారు. “కమిటీలో ఎవరు ఉన్నారు? వారు ఎవరి ప్రతినిధులు?” అనే ప్రశ్నలు జర్నలిస్టు వర్గాల్లో వినిపిస్తున్నాయి.

డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ అధికారుల (డిపిఆర్‌వోలు) పాత్రపై కూడా కొందరు జర్నలిస్టులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఎంపికలో తమకు అనుకూలమైన పేర్లను ప్రతిపాదిస్తున్నారని, ఆ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లకు సమగ్ర సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు.

అక్రిడేషన్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా జర్నలిస్టు వృత్తికి గౌరవ సూచికమని జర్నలిస్టులు పేర్కొంటున్నారు. అయితే అర్హులైన వారికి కాకుండా ఇతరులకు అక్రిడేషన్ దక్కుతున్నట్లు భావన ఏర్పడితే, వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు వేతనం, భద్రత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, కనీస గుర్తింపు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రిడేషన్ కమిటీ సభ్యుల వివరాలను బహిర్గతం చేయాలని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. “పనిచేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వడం హక్కు” అని వారు స్పష్టం చేస్తున్నారు.


ఇండ్ల మహేష

 రిపోర్టర్

Image 1

స్నేహ సుగంధం---మంజుల పత్తిపాటి

Posted On 2026-07-29 05:09:34

Readmore >
Image 1

విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్

Posted On 2026-07-29 04:49:54

Readmore >
Image 1

రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్

Posted On 2026-07-29 04:48:42

Readmore >
Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >