| Daily భారత్
Logo




మాజీ డిజిపి దారుణ హత్య?

News

Posted on 2025-04-20 19:19:29

Share: Share


మాజీ డిజిపి దారుణ హత్య?

డైలీ భారత్, బెంగళూరు: కర్ణాటకలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కర్ణాటక డీజీపీగా, ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓంప్రకాష్.. అతని ఇంట్లో శవమై కనిపించారు. 

బెంగళూరులోని హెచ్ఎస్ ఆర్ లేఅవుట్లో‌ని ఆయన నివాసంలో ఓంప్రకాష్ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓంప్రకాష్ హత్య కేసులో ఆయన భార్యను ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్నారు. ఓం ప్రకాష్ హత్యకు గురైన విషయాన్ని పోలీస్ కమిషనర్ దయా నంద ధ్రువీకరించారు.

రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ, భార్యపైనే అనుమానాలు!

ఓం ప్రకాష్ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో బెంగళూరు లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉన్న ఆయన నివాసంలో గుర్తించారు. రక్తపు మడుగులో ఓం ప్రకాష్ మృతదేహం పోలీసులకు కనిపించింది. 

ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్‌ను ఆయన భార్యే హత్య చేసినట్లు అనుమానిస్తు న్నారు. ఓం ప్రకాష్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు తెలి సింది. అయితే ఈ ఘటనపై తామింకా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడలేదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. 

పూర్తి సమాచారం అందిన తర్వాత ఓం ప్రకాష్ మృతిపై మాట్లాడతామని చెప్తున్నారు.మరోవైపు ఓం ప్రకాష్ భార్య అంతకు ముందు ఓ వాట్సప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది. తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నా డని.. తనను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడని అందులో ఓంప్రకాష్ భార్య పేర్కొన్నట్లు సమాచారం, 

అయితే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలిసింది. దీనిపైనా పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఓం ప్రకాష్ భార్యను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >