కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంబంధించింది కేశవ్ పురం ప్రాంతం లారెన్స్ రోడ్డులోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సమీపంలోని ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది,
దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి ఇక సమీపా నివాసాల దగ్గర దట్టంగా పొగ కమ్ముకుంది దీంతో ప్రజలు బయటకు వచ్చేసారు ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం 14 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియ రాలేదు.