| Daily భారత్
Logo




నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

News

Posted on 2026-06-24 19:13:12

Share: Share


నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఎల్ ఆదినారాయణ జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా మరియు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు, దుకాణదారులు మాత్రమే కాకుండా సంబంధిత కంపెనీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

రైతులకు విత్తనాలు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

దుకాణాలలో ఉన్న స్టాక్‌ను రోజువారీగా నమోదు చేయడంతో పాటు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు–అమ్మకాల బిల్లులు తనిఖీ సమయంలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాలు మరియు దుకాణంలో ఉన్న స్టాక్ మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదన్నారు.

విత్తనాలను ఎంఆర్పీ ధరలకు మించి విక్రయించరాదని, రైతులు కొనుగోలు చేసిన ప్రతి విత్తనానికి సంబంధించి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.

 రైతులు కోరిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, గ్రామాల్లో తిరుగుతూ అనధికారికంగా విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో పటిష్ట నిఘా కొనసాగుతోందని, అనుమానం ఉన్న సందర్భాల్లో డీలర్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >