Posted on 2026-06-24 19:11:52
నీట్ బాధితులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీకి నాయకత్వం వహించిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్"
డైలీ భారత్, కామారెడ్డి : నీట్ పేపర్ లీకేజ్ ఘటనలతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో, బాధిత విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జీ చేపట్టిన "చాత్రోన్ కీ గూంజ్" కార్యక్రమానికి మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ ర్యాలీలో కామారెడ్డి చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, కామారెడ్డి పట్టణ టౌన్ ప్రెసిడెంట్ ఐరేని సందీప్ కుమార్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అజీమ్ లాలా, ఎస్సీ, ఎస్టీ, సెల్ అధ్యక్షులు, వివిధ మండలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, డిసిసి కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, పంచముఖ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ కొత్త బీమ్ రాజ్
పార్టీ శ్రేణులు, విద్యార్థి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి నీట్ పేపర్ లీకేజ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
కామారెడ్డి పట్టణంలో కొవ్వొత్తుల వెలుగులతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించగా, విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతోందనే సందేశాన్ని బలంగా చాటిందని పలువురు అభిప్రాయపడ్డారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >