ముదినేపల్లి పోలీసుల వలలో మ్యాట్రిమోనియల్ సైట్ మోసగాడు
డైలీ భారత్, ముదినేపల్లి: మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా వివాహం పేరుతో మహిళలను మోసం చేసి నగదు, బంగారం కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు వక్కలగడ్డ సాంబశివరావును అరెస్ట్ చేశారు.
నిందితుడు తాను ప్రముఖ మీడియా సంస్థలో CEOగా పనిచేస్తున్నానని, కుటుంబం ఉన్నత స్థాయిలో ఉందని అబద్ధాలు చెబుతూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా మహిళలకు పరిచయమయ్యేవాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి, ప్రేమ మరియు పెళ్లి పేరుతో మహిళల నుంచి నగదు, బంగారం తీసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 మందికిపైగా మహిళలను మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ కేసు ఛేదనలో కైకలూరు రూరల్ సీఐ వి. రవి కుమార్, ముదినేపల్లి ఎస్‌ఐ వి.ఎస్.వి. భద్రరావు, హెడ్ కానిస్టేబుళ్లు బి. పెద్దిరాజు, పి.వి. సత్యనారాయణ, పోలీస్ కానిస్టేబుళ్లు బి. నాగబాబు, పి. పవన్ కుమార్, హోంగార్డ్ జి. శివ కోటయ్య కీలక పాత్ర పోషించారు. వారి ఉత్తమ సేవలను ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS అభినందించారు.
#EluruPolice #MudinepalliPolice #CrimeDetection #MatrimonialFraud #CyberAwareness #WomenSafety #SPPratapShivaKishoreIPS #AndhraPradeshPolice #StayAlertStaySafe #EluruDistrictPolice