| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలై తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబర్ క్రైమ్ స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి ఆయన ఈ విషయాలను బుధవారం వెల్లడించారు. పిల్లలు ఫ్రీఫైర్ వంటి ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రుల ఫోన్లలో సేవ్ చేసిన కార్డ్ వివరాలు, యూపీఐలను వాడుతున్నారని, ముఖ్యంగా వృద్ధుల ఫోన్లలో ఈ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ గేమింగ్ యాప్‌ల నియంత్రణకు ప్రభుత్వాలు, గూగుల్ వంటి సంస్థలకు లేఖలు రాస్తామని, తల్లిదండ్రులు పిల్లల ఫోన్లలో సేవ్ చేసిన వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్, బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలని సూచించారు.

Previous పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత
Next వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి
ADVERTISEMENT