| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

డైలీ భారత్, చర్ల: ఎన్సీపీ పార్టీ, ఎన్డీఏ మహాకూటమి ఆధ్వర్యంలో చర్ల మండలానికి చెందిన సుమారు 100 మంది యువకులు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి (NYC) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జి, జాతీయ కార్యవర్గ సభ్యులు డా. మద్దిశెట్టి సామేలుసమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఊకే వెంకన్న, చర్ల మండల అధ్యక్షులు సుందర్ రావు, ఇల్లందు అసెంబ్లీ ఇన్‌చార్జి కారం చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగింది.చర్ల, కొరనవల్లి, బత్తినపల్లి, బోధనపల్లి, చింతగుంపు, కలివేరు గ్రామాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున ఎన్సీపీ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామాలలో పక్కా ఇళ్లు, సీసీ రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే పోడు భూములకు బోర్లు మంజూరు చేసే విధంగా ఐటిడిఏ పీఓ మరియు జిల్లా కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకోవాలని డా. మద్దిశెట్టి సామేలుకు వినతిపత్రం అందజేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని డా. మద్దిశెట్టి సామేలు హామీ ఇచ్చారు.

Previous ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Next మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
ADVERTISEMENT