Posted on 2025-04-20 19:16:34
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు స్థానిక మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ సాయి నగర్ నందు స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ సిరిసిల్ల మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కరీంనగర్ వన్ టౌన్ ఎస్ఐ సాయి కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది అతిథులుగా న్యూరో ఫిజీషియన్ మంజూష సైకియాట్రిస్ట్ పున్నం చందర్ బిజెపి నాయకులు దుమాల శ్రీకాంత్ డెంటిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ విచ్చేయడం జరిగింది ముఖ్య అతిధుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 120 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు చేసిన కుంగ్ ఫు హ్యాండ్ మూమెంట్స్ కటాస్, ఫైట్,నాంచాక్ మూమెంట్స్ స్టిక్ రోలింగ్ ఫైర్ తో స్టిక్ రోలింగ్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంది.ఇట్టి శారీరక దేహ దారుడ్య పరీక్షలో 50 మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా బెల్టులు సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది. చోడిబోయిన శివేష్, ఎల్లే హరిహర లు బ్లాక్ బెల్ట్ సాధించారు.6గురు యెల్లో, 8మంది ఆరంజ్,8మంది గ్రీన్,10మంది బ్లూ,8మంది పర్పుల్ 8మంది బ్రౌన్, ఇద్దరు బ్లాక్ బెల్ట్ లు సాధించారు.రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ కుంగ్ ఫు ప్రాచీన యుద్ధ కళ అని కుంగ్ ఫు నేర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కుంఫు యుద్ధ విద్యను నేర్చుకోవాలని ఆపద సమయంలో ఎవరో వచ్చి మనల్ని కాపాడతాడని ఎదురు చూడకుండా మనది మనం రక్షించుకోవడం జరుగుతుందని అన్నారు, డాక్టర్ మంజుష మాట్లాడుతూ కుంగ్ ఫు నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్క నరంలోకి రక్త ప్రసరణ జరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల విద్యార్థిని విద్యార్థులు చదువులో ముందు ఉండడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎగ్జామినర్ గా మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ వ్యవ హరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మాస్టర్ గగ్గూరి దివ్య, మాస్టర్ వోడ్నాల అన్నపూర్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >