| Daily భారత్
Logo




వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్

News

Posted on 2025-04-20 15:02:56

Share: Share


 వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్

పెండిరగ్‌ బిల్లులు, డి.ఎ.లను వెంటనే విడుదల చేయాలి

సి.పి.ఎస్‌. విధానాన్ని రద్దు చేయాలి

పారిశుధ్య సిబ్బంది వేతనాలు చెల్లించాలి

కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి

TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం  ఈరోజు సిరిసిల్లలో  టి.పి.టి.ఎఫ్  ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి హాజరయ్యారు

టిపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ యాజమాన్యాల ఆధ్వర్యాన పలు రకాల పాఠశాలలను నెలకొల్పి అంతరాలు కల్గిన విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారానే విద్యారంగంలో అసమానతలు ఏర్పడ్డాయి. వివిధ యాజమాన్యాల కింద కొనసాగుతున్న పాఠశాలలను రద్దు చేసి, ప్రైవేటు పాఠశాలల వ్యవస్థను రద్దు చేసి విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన, శాస్త్రీయమైన విద్య అందించాలంటే ‘‘కామన్‌ స్కూల్‌ విద్యా విధానాన్ని’’ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 56 పాఠశాలలకే వేలకోట్ల నిధులు కేటాయించి వేలాది పాఠశాలల అభివృద్ధికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదని, విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అన్ని జిల్లాల్లో మంజూరు అయినప్పటికీ ఈ జిల్లాలో ఇవ్వకపోవడం  అన్యాయం అన్నారు..

టీపీటీఎఫ్‌ రాష్ట్ర  ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల కింద కొనసాగుతున్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న డి.ఎ.లను, పెండిరగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పిఆర్‌సి కమిటీ రిపోర్టును బహిరంగపరిచి వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

టి.పి.టి.ఎఫ్  ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కులగనన సర్వేలో పాల్గొన్న సిబ్బందికి గౌరవవేతనం వెంటనే ఇవ్వాలని అదేవిధంగా వారికి సెలవుల్లో పనిచేసిన రోజులకు సీసీఎల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలుగూరి కిషన్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య,  జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, దబ్బెడ  హనుమాన్లు మందాడి శ్రీనివాసరెడ్డి, నూగురి దేవేందర్, జిల్లా కార్యదర్శి పార్వతి తిరుపతి, తాళ్లపల్లి శ్రీధర్, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎడ్ల కృష్ణ చైతన్య, బుస రాజేందర్, చకినాల భాస్కర్, సిద్ధంశెట్టి శ్రీనివాస్ రమేష్ రెడ్డి  రాంప్రసాద్, శ్రీనివాస్, లు పాల్గొన్నారు

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >