Posted on 2025-04-18 08:00:27
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిరుపేదలకు సొంతింటి పథకం కింద ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం చేవెళ్ల పట్టణంలోని కేజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సన్నాహక సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో పేదల కల అయిన సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులైన పేద ప్రజలకు పారదర్శకంగా పంపిణీ చెయ్యాలని తెలియజేసారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఆరు గ్యారంటీలలో భాగంగా అన్ని పథకాలను ముందుకు తీసుకు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డిఓ చంద్రకళ,మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పెంటయ్య గౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, శాబాద్ దర్శన్,ప్రతాప్ రెడ్డి,దండు రాహుల్ గుప్త,కుమ్మరి చెన్నయ్య, ఎంపిడిఓలు, ఎంఆర్ఓలు,ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >