| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్  జన్మదిన వేడుకలు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్  జన్మదిన వేడుకలను BRS పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారుఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు , వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు భారీ కేకు ను కట్ చేసి భారాస ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కేకు తినిపించి తాత మధుసూదన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారుఈ సందర్భంగా గిరిబాబు  మాట్లాడుతూ తాత మధుసూదన్  నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా అకాంక్షిస్తున్నామని తెలిపారుతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్గదర్శకంలో పనిచేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన వారికీ మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారుఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Previous హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు
Next జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
ADVERTISEMENT